: కొడుకుకు పోటీగా వస్తాడనే జూనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు దూరం పెట్టారు: హరీష్ రావు
కేసీఆర్ తనకు వేలు విడిచిన మేనమామ మాత్రమే కాదనీ, వేలు పట్టి నడిపించిన తండ్రిలాంటివారు కూడా అని టీఎస్ మంత్రి హరీష్ రావు అన్నారు. తన రాజకీయ జీవితం, పదవి కేసీఆర్ పెట్టిన భిక్షే అని చెప్పారు. కేసీఆర్ కు వెన్నుపోటు పొడవాల్సిన అవసరం తనకు లేదని తెలిపారు. కేసీఆర్ కు వెన్నుపోటు పొడుస్తానని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయని... ఇకపై రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించమని హెచ్చరించారు. వెన్నుపోట్ల పునాదుల మీద నడుస్తున్న పార్టీ టీడీపీనే అని మండిపడ్డారు. కొడుకుకు పోటీగా వస్తాడనే ఉద్దేశంతోనే జూనియన్ ఎన్టీఆర్ ను చంద్రబాబు దూరం పెట్టారని హరీష్ ఆరోపించారు.