: డ్రెస్సింగ్ రూమ్ లో క్రికెటర్ ప్రవీణ్ కుమార్ గోల్డ్ చైన్ మాయం
విదర్భ క్రికెట్ అసోసియేషన్ కు చెందిన డ్రెస్సింగ్ రూమ్ లో క్రికెటర్ ప్రవీణ్ కుమార్ బంగారు చైన్ ను ఎవరో దొంగిలించారని పోలీసులు తెలిపారు. దాని విలువ రూ.8 లక్షలు ఉంటుందని చెప్పారు. గత రాత్రి (మంగళవారం) ఈ ఘటన జరిగిందని, ఈరోజు ఫిర్యాదు నమోదు చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం 'విజయ్ హజారే వన్ డే క్రికెట్ టోర్నమెంట్'లో ఉత్తరప్రదేశ్ తరపున ప్రవీణ్ ఆడుతున్నాడు. ఈ క్రమంలో రాజస్థాన్ పై మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్ లోని ఛైర్ పై తన 250 గ్రాముల చైన్ ను వదిలేసి వెళ్లాడట. మ్యాచ్ తరువాత అతను డైరెక్ట్ గా హోటల్ కు వెళ్లాడని, అప్పుడే తన చైన్ ను మర్చిపోయినట్టు గుర్తు తెచ్చుకున్నాడని పోలీసులు చెప్పారు. వెంటనే అసోసియేషన్ అధికారులకు చైన్ విషయం చెప్పగా వెతికారని, కానీ దొరకలేదని పేర్కొన్నారు. అటు ఈ ఘటనను విదర్భ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రకాష్ దీక్షిత్ కూడా ధృవీకరించారు. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందన్నారు.