: మహారాష్ట్రలో శివసేన ఇక 'పులి' కాదు: ఎన్సీపీ
మహారాష్ట్రలో శివసేన ఇక 'పులి' కాదు... ఫడ్నవిస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మహారాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో గెలిచిన తరువాత ఎన్సీపీ చేసిన వ్యాఖ్య ఇది. 'మహా' రాజకీయాల్లో ఇప్పటివరకు చక్రం తిప్పిన శివసేన నిన్నమొన్నటి వరకు మిత్రపక్షమైన బీజేపీతో తెగతెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్సీపీని 'ఎలుక'లతో పోలుస్తూ ఉద్ధవ్ థాకరే చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా, శివసేన ఎన్నికల చిహ్నమైన 'పులి' గుర్తును దృష్టిలో పెట్టుకునే ఎన్సీపీ ఈ దెప్పిపొడుపు కామెంట్ చేసింది. ఈ పార్టీ అధికారంలోకి వస్తే వారికి మద్దతు పలుకుతున్న ఎన్సీపీ ఇప్పటి వరకు రాష్ట్రాన్ని ఎలుకల మాదిరిగా పీక్కు తిందని ఉద్ధవ్ సామ్నా పత్రిక సంపాదకీయంలో విమర్శించారు. కాగా మూజువాణి వోటింగ్ తో బీజేపీ విశ్వాస పరీక్షలో గెలిచింది.