: ఇంతవరకు విద్యుత్ కొనుగోలుకు రూ. 2,500 కోట్లు వెచ్చించాం: హరీష్ రావు
గత నాలుగు నెలల్లో విద్యుత్ కొనుగోలుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. 2,500 కోట్లు ఖర్చు చేసినట్టు నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు శాసనమండలిలో తెలిపారు. విద్యుత్ మిగులు రాష్ట్రంగా మార్చేందుకు తమ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో, అవసరమైతే విదేశీ బొగ్గును దిగుమతి చేసుకుంటామని తెలిపారు. గోదావరి బేసిన్ ప్రాంతంలో విద్యుదుత్పత్తి యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండలికి వివరించారు. విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు రాష్ట్రంలో అఖిలపక్షం కేంద్రంపై ఒత్తిడి తెచ్చే విధంగానూ ప్రయత్నిస్తున్నామని హరీష్ రావు పేర్కొన్నారు.