: కొనసాగుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగుల సమ్మె... నిలిచిన లావాదేవీలు
తమ వేతనాలు సవరించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు చేబట్టిన ఒక రోజు సమ్మె ప్రశాంతంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా 21 ఉద్యోగ సంఘాలు ఈ సమ్మెకు మద్దతు పలికాయి. హైదరాబాద్ లోని కోఠిలో పలు బ్యాంకుల సిబ్బంది మహా ధర్నా చేపట్టడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. అటు విజయవాడ లోని బెంజ్ సర్కిల్ లో సైతం సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఉద్యోగులు చేసిన ధర్నా ఫలితంగా హైవేపై రాకపోకలు కాసేపు నిలిచాయి. ఎస్ బీఐ ఉద్యోగులు సమ్మెలో ఉండటంతో భారీ స్థాయిలో లావాదేవీలు నిలిచాయి. ఐసీఐసీఐ, హెచ్ డీఎఫ్ సీ వంటి ప్రైవేటు బ్యాంకుల్లో యథావిధిగా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం ఎటీఎం సేవలకు ఎటువంటి అంతరాయం కలుగలేదు.