: పతకం తిరస్కరించిన బాక్సర్ సరితా దేవికి త్వరలో భారీ శిక్ష!
దక్షిణ కొరియాలోని ఇంచియాన్ లో సెప్టెంబర్ లో జరిగిన ఏషియన్ గేమ్స్ లో బాక్సర్ సరితాదేవి పతకం తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమెపై సస్పెన్షన్ వేటు కూడా పడింది. అంతేగాక త్వరలో సరితకు భారీ శిక్ష విధించనున్నట్టు క్రీడా పాలక సంస్థ ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ (ఏఐబిఏ) తెలిపింది. ఈ మేరకు ఏఐబిఏ అధ్యక్షుడు సీకే.వూ మాట్లాడుతూ, అతి త్వరలోనే కమిషన్ ఈ అంశానికి సంబంధించి తన నిర్ణయాన్ని చెబుతుందని, భారీ జరిమానా కూడా విధిస్తుందని టెలిఫోన్ ఇంటర్వ్యూలో తెలిపారు.