: మోదీ టీంలో కపిల్, గవాస్కర్


అవును, మీరు చదివింది నిజమే. భారత క్రికెట్ టీంలో లెజెండ్ లుగా పేరు తెచ్చుకున్న కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ లు ప్రధాని నరేంద్ర మోదీ టీంలో చేరారు. అయితే, మంత్రులుగా కాదండోయ్... ఆస్ట్రేలియాలో పర్యటించనున్న మోదీ బృందంలో సభ్యులుగా మాత్రమే! ఈ విషయాన్ని కపిల్ స్వయంగా మీడియాతో పంచుకున్నాడు. మోదీతో కలసి తాము ఆస్ట్రేలియాలోని సిడ్నీ, కాన్బెర్రా, మెల్బోర్న్ నగరాల్లో పర్యటించనున్నట్టు వివరించాడు. ఇది తనకు ఒక అద్భుత అవకాశమని, క్రికెటర్ లను మోదీ ఎలా ఉపయోగించుకుంటారో, అయన మనసులో ఏముందో తెలీదని కపిల్ అన్నాడు.

  • Loading...

More Telugu News