: 'అలీబాబా' అద్భుతం...ఒకే రోజులో 9 బిలియన్ డాలర్ల ఆర్డర్లు!


పేరులోనే కాదండోయ్, పనితీరులోనూ చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా.. నిజంగా అద్భుత దీపమే. ఎందుకంటే, ఒకే రోజు 9 బిలియన్ డాలర్ల ఆర్డర్లను కొల్లగొట్టేసింది. తద్వారా తన సత్తానే కాక చైనా కొనుగోలు శక్తిని ప్రపంచానికి చాటిచెప్పింది. బిగ్ బిలియన్ డే పేరిట దేశీ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ఒకే రోజు రూ.10 కోట్ల ఆర్డర్లను చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఫ్లిప్ కార్ట్ వ్యవస్థాపకుడు బన్సల్ మిత్రులు అలీబాబాను ఆదర్శంగా తీసుకునే కార్యరంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. తన శిష్యుల రికార్డును బద్దలు కొట్టేందుకు అలీబాబా చైర్మన్ జాక్ మా, ‘చైనాస్ సింగిల్స్ డే’ (తేదీలో ఎక్కువగా ఒకటి సంఖ్య రిపీట్ కావడాన్ని సింగిల్స్ డే అంటారు. నిన్న 11-11-14 కావడంతో సింగిల్స్ డే అయింది) పేరిట మంగళవారం ప్రత్యేక ఆర్డర్ల స్వీకరణకు తెరతీశారు. 'జాక్ మా' ఆఫర్ కు చైనీయులు బ్రహ్మరథం పట్టారు. ఒకే రోజు 9 బిలియన్ డాలర్ల ఆర్డర్లను అలీబాబాకు అందించారు.

  • Loading...

More Telugu News