: పూణేలో అభిమానుల తాకిడికి అల్లాడిన మహేష్ బాబు!


సినిమా హీరోలకు ఉండే ఇమేజ్ అంతా ఇంతా కాదు. అందునా మహేష్ బాబు లాంటి నటులంటే ఇక చెప్పేక్కర్లేదు. అందుకే పెద్ద తారలతో ఔట్ డోర్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వుంటారు. అయితే, పూణేలో మహేష్ కు అభిమానులు తక్కువ అనుకున్నారో ఏమో కానీ, సరైన భద్రతా ఏర్పాట్లు లేకుండానే అక్కడి ఐటీ హబ్ లో షూటింగ్ మొదలు పెట్టారు. ఇంకేముంది, ఇసుకేస్తే రాలనంతమంది వచ్చి చుట్టుముట్టారు. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న చిత్రం షూటింగ్ సందర్భంగా పూణేలో ఈ సంఘటన జరిగింది. అభిమానులతో సరదాగా ముచ్చటించే మహేష్, వందల మంది ఒకేసారి అలా చుట్టుముట్టడంతో కాస్తంత ఇబ్బందే పడ్డాడు!

  • Loading...

More Telugu News