: ‘ఆక్సిటోసిన్’ పాలతో దుష్పరిణామాలు: టీ సభలో ఎమ్మెల్యే ఆందోళన


కల్తీ పాలతో తీవ్ర ప్రమాదం పొంచి ఉందని తెలంగాణ శాసనసభలో ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. త్వరగా పాలను సేకరించాలన్న దురుద్దేశంతో పాడి పరిశ్రమ రైతులు గేదెలకు ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు ఇస్తున్నారని, ఆక్సిటోసిన్ కలిగిన పాలతో తీవ్ర దుష్పరిణామాలు ఉంటాయని ఆయన చెప్పారు. సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా రవీందర్ రెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తారు. గ్రామీణ ప్రాంతాల్లో సరిపడినంత మంది పశువైద్య నిపుణులు, సహాయక సిబ్బంది లేని కారణంగానే ఈ తరహా వ్యాపారం విస్తరిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, పాల కల్తీని అడ్డుకుంటామని, త్వరలోనే పశువైద్య శాఖ ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించారు. ఈ విషయంలో టీడీపీ సభ్యులు కలుగజేసుకోవడంతో సభలో గందరగోళం నెలకొంది.

  • Loading...

More Telugu News