: శ్రీవారి సేవలో నటుడు మోహన్ బాబు కుటుంబం
ప్రముఖ నటుడు మోహన్ బాబు సకుటుంబ సమేతంగా బుధవారం తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆయన శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయ డిప్యూటీ ఈఓ చెన్నంగారి రమణ స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. మోహన్ బాబు వెంట ఆయన కొడుకులు విష్ణు, మనోజ్, కుమార్తె లక్ష్మీ ప్రసన్న ఉన్నారు.