: 'మహా' స్పీకర్ పదవికి త్రిముఖ పోరు


మహారాష్ట్ర అసెంబ్లీలో రేపు దేవేంద్ర ఫడ్నవిస్ సర్కారు బలనిరూపణ పరీక్ష ఎదుర్కోనుంది. విశ్వాస పరీక్షకు ముందే శాసనసభ స్పీకర్ ను ఎన్నుకోనున్నారు. భారత చరిత్రలో తొలిసారిగా, మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పదవికి త్రిముఖ పోరు నెలకొంది. బీజేపీ, శివసేన, కాంగ్రెస్ పార్టీలు స్పీకర్ పదవికి అభ్యర్థులను బరిలోదింపుతున్నాయి. బీజేపీ తరపున హరిభావు కె బాగ్డే నామినేషన్ దాఖలు చేయగా, శివసేన నుంచి విజయ్ ఆటీ, కాంగ్రెస్ తరపున వర్ష గైక్వాడ్ నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ తొలుత ఎన్సీపీ స్పీకర్ అభ్యర్థికి మద్దతిస్తామని ప్రకటించినా, ఎన్సీపీ అభ్యర్థిని బరిలో దించలేదు. దీంతో, తామే స్వయంగా పోటీకి దిగాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది.

  • Loading...

More Telugu News