: కాంగ్రెస్ తప్ప ఏ పార్టీ మద్దతిచ్చినా ఓకే: బీజేపీ ఓపెన్ ఆఫర్


ఒక్క కాంగ్రెస్ పార్టీ మినహా మరే పార్టీ నుంచి తమకు మద్దతు లభించినా స్వీకరిస్తామని బీజేపీ సీనియర్ నేత రాజీవ్ ప్రతాప్ రూడీ వ్యాఖ్యానించారు. బుధవారం నాడు బీజేపీ 'మహా' అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అభివృద్ధిని కోరుకునే వారు ఎవరైనా తమ వెంట రావచ్చని ఆయన అన్నారు. శివసేన సైతం మంకుపట్టు వీడి కలసి వస్తుందని భావిస్తున్నట్టు రూడీ తెలిపారు. ఎన్నికలకు ముందు సైతం ఆ పార్టీతో కలసి పని చేయాలని అనుకున్నామని, ఇప్పుడు కూడా ప్రభుత్వంలో శివసేన భాగంగా ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. ఎన్.సి.పి ఇప్పటికే బేషరతుగా మద్దతు ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

  • Loading...

More Telugu News