: అండమాన్ దీవుల్లో భూకంపం


అండమాన్ నికోబార్ దీవుల్లో ఈ మధ్యాహ్నం స్వల్ప భూకంపం వచ్చింది. అండమాన్ పరిధిలోని మోహిన్ కు 126 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని, రిక్టర్ స్కేల్ పై తీవ్రత 5.3గా నమోదైందని అధికారులు వెల్లడించారు. ఈ భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించలేదని వివరించారు. కాగా, ఈ సంవత్సరంలో అండమాన్ లో స్వల్ప భూకంపం రావడం ఇది నాలుగోసారి.

  • Loading...

More Telugu News