: ఎల్ఓసీ వెంబడి మరోసారి కాల్పులకు తెగబడ్డ పాకిస్తాన్
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ సైన్యం వాస్తవాధీన రేఖ (ఎల్ఓసీ) వద్ద కాల్పులకు తెగబడింది. మంగళవారం నాడు బారాముల్లా జిల్లా పరిధిలోని కమల్కొటే ప్రాంతంలో భారత సైనిక స్థావరాలపై పాక్ తేలికపాటి ఆయుధాలు, గన్స్ వినియోగిస్తూ కాల్పులు జరిపిందని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. గత శనివారం నాడు సైతం ఇదే ప్రాంతంలో పాక్ దళాలు కాల్పులు జరుపగా 17 సంవత్సరాల బాలికతో పాటు ఓ సైనికుడు కూడా మరణించిన సంగతి తెలిసిందే.