: 'అత్యంత వినోద' నగరాల జాబితాలో ఢిల్లీకి చోటు
దేశ రాజధాని ఢిల్లీ పలు సర్వేల్లో ఇతర నగరాలతో పోటీ పడుతోంది. ఈ క్రమంలో ప్రపంచంలో 'అత్యంత వినోద' నగరాల జాబితాలో ఢిల్లీ 25వ స్థానంలో నిలిచింది. జర్మనీ రాజధాని బెర్లిన్ ఈ సర్వేలో తొలి స్థానంలో చోటు సంపాదించింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 1800 నగరాలను సర్వేలో తీసుకోగా, భారత్ నుంచి ఢిల్లీ ఒక్కటే ఆ స్థానం పొందింది. ఢిల్లీలో అధికంగా స్పోర్ట్స్ క్లబ్స్, షాపింగ్, బార్స్ ఉన్న నేపథ్యంలో 'ద అల్టిమేట్ ఫన్ సిటీ ర్యాంకింగ్'లో ఈ నగరం చేరినట్టు 'గెట్ యువర్ గైడ్', 'గో యూరో' ట్రావెల్ సంస్థల నివేదికలో తేలింది. రాత్రి జీవనం, సగటు బీర్ ధర, పలు వయసుల ప్రయాణికుల అభిరుచులకు అనుగుణంగా వారిని వినోద పరిచేందుకు ఒక సిటీలో ఎలాంటి ప్రత్యామ్నాయాలున్నాయన్న పదకొండు అంశాల ఆధారంగా సమాచారాన్ని సేకరించి, ఆ రెండు సంస్థలు ఓ నివేదిక రూపొందించాయి. ఈ క్రమంలో బెర్లిన్ తరువాత లండన్, పారిస్, న్యూయార్క్, టోక్యో నగరాలు ఉన్నాయి.