: ముస్లింల మనసుల్లో ఒవైసీ సోదరుల విష బీజాలు: శివ సేన
ముస్లింల మనసుల్లో మజ్లిస్ విషబీజాలు నాటిందని, ముఖ్యంగా ఒవైసీ సోదరులు ఛాందసవాద ఆలోచనలను విస్తరింప చేస్తున్నారని శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే తీవ్ర విమర్శలు చేసారు. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎంఎల్ఎ అక్బరుద్దీన్ ఒవైసీలు దేశవ్యాప్తంగా ముస్లింల ఆలోచనలను చెడగొడుతున్నారని అన్నారు. హిందూ మతానికి, హిందువులకు ఎంతో ప్రమాదకరమైన శక్తులు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాయని అంటూ, ఒవైసీ సోదరులపై కఠిన చర్యలు తీసుకోవాలని థాకరే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. నాందేడ్ మునిసిపల్ కార్పొరేషన్ లో విజయం సాధించిన ఆ ఛాందసవాదులు మరాట్వాడ రీజియన్లోకి విస్తరించాలని చూస్తున్నారని సామ్నా పత్రికకు రాసిన సంపాదకీయంలో అయన వ్యాఖ్యానించారు.