: 'స్వైన్ ఫ్లూ' అనుమానంతో ఏడుగురే వచ్చారు!: గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్
ఓ వైపు హైదరాబాదులో 14 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయనే వార్త సంచలనం రేపితే... మరోవైపు నగరంలో స్వైన్ ఫ్లూ మందులకు కొరత ఉందనే వార్త అంతకంటే ఎక్కువ బెంబేలెత్తించింది. దీంతో, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ధైర్యవాన్ హుటాహుటిన స్పందించారు. స్వైన్ ఫ్లూ అనుమానంతో ఏడుగురు ఆసుపత్రికి వచ్చారని... వీరిలో ఆరుగురికి స్వైన్ ఫ్లూ లేదని తేలిందని... మరో మహిళ టెస్ట్ రిపోర్ట్ రావాల్సి ఉందని చెప్పారు. వార్తల్లో వచ్చినట్టు స్వైన్ ఫ్లూ మందుకు కొరత లేదని... ఈ వ్యాధిని ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.