: 2జీ స్కాం సంగతంతా చిదంబరానికి తెలుసు!: కాంగ్రెస్ నేత హెచ్.ఆర్.భరద్వాజ్
రెండవ తరం (2జీ) రేడియో తరంగాల కుంభకోణం అప్పటి కేంద్ర మంత్రి పి.చిదంబరానికి తెలుసనీ, జరుగుతున్న స్కాంను ఆపేందుకు అయన ప్రయత్నించలేదని మాజీ న్యాయ శాఖ మంత్రి హెచ్.ఆర్.భరద్వాజ్ ఆరోపించారు. గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడుగా పేరు తెచుకున్న భరద్వాజ్ ఈ ఆరోపణలు చేయడం కాంగ్రెస్ వర్గాల్లో సంచలనం కలిగించింది.
ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ సైతం లైసెన్సులను క్యాన్సిల్ చేయడం ద్వారా ఈ కుంభకోణాన్ని ఆపి ఉండవచ్చని భరద్వాజ్ అన్నారు. అసలు 2జీ తరంగాల పంపిణి మొదలు పెట్టిందే చిదంబరం, డీఎంకే మంత్రులని ఆరోపించారు. భరద్వాజ్ ఆరోపణలపై స్పందించేందుకు చిదంబరం నిరాకరించారు.