: బ్యాంకర్ల వ్యవహారశైలి బాగోలేదు: కేసీఆర్


బ్యాంకర్ల వ్యవహారశైలిని టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుబట్టారు. స్వయం ఉపాధి పథకం కింద వెనుకబడిన వర్గాలకు రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకర్ల తీరు బాగోలేదని అన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, రుణాల విషయంలో బ్యాంకర్ల తీరు వల్ల నిరుద్యోగ యువతకు అన్యాయం జరుగుతోందని అంగీకరించారు. ఈ విషయానికి సంబంధించి త్వరలోనే అన్ని ఫ్లోర్ లీడర్లతో సమావేశమై ఏకాభిప్రాయంతో ఒక నిర్ణయం తీసుకుందామని చెప్పారు.

  • Loading...

More Telugu News