: రేపు నిలిచిపోనున్న బ్యాంకు లావాదేవీలు
ప్రభుత్వరంగ బ్యాంకుల కార్యకలాపాలన్నీ రేపు (బుధవారం) నిలిచిపోనున్నాయి. జీతాలు పెంచాలని ఎన్నాళ్లగానో డిమాండ్ చేస్తున్నప్పటికీ... బ్యాంకుల యాజమాన్యాలు పట్టించుకోకపోవడంతో... బ్యాంకుల సిబ్బంది ఒకరోజు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నెల 12న దేశవ్యాప్త సమ్మె చేపడుతున్నట్టు చీఫ్ లేబర్ కమిషనర్ కు నోటీసు కూడా ఇచ్చామని 'ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్' జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం తెలిపారు.