: అలనాటి నటి జమున భర్త కన్నుమూత


అలనాటి అందాల నటి జమున భర్త రమణారావు గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. ప్రొఫెసర్ అయిన రమణారావు ఉస్మానియా యూనివర్శిటీ, శ్రీవేంకటేశ్వరా యూనివర్శిటీల్లో జువాలజీ అధ్యాపకుడిగా పనిచేశారు. 1965లో జమున, రమణారావుల వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ మధ్యాహ్నం పంజాగుట్ట శ్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

  • Loading...

More Telugu News