: నేడు విశాఖకు వైఎస్ జగన్
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు విశాఖపట్నం వెళ్లనున్నారు. సోమవారం మృతి చెందిన కాపు నేత మిరియాల వెంకట్రావు కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన విశాఖ వెళుతున్నారు. మిరియాల మృతి నేపథ్యంలో సోమవారమే ఆయన కుటుంబానికి ఫోన్ లో సంతాపం తెలిపిన జగన్, నేడు ప్రత్యక్షంగా పరామర్శించనున్నారు. మిరియాల కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం జగన్ తిరిగి హైదరాబాద్ రానున్నారు.