: సల్మాన్ కు, నాకు మధ్య ఫార్మాలిటీస్ లేవు: అమీర్ ఖాన్


బాలీవుడ్ నటులు అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ మంచి స్నేహితులన్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకు నిదర్శనంగా ఇటీవల 'సత్యమేవ జయతే' షోకు అమీర్ పిలిచిన వెంటనే సల్లూ వచ్చాడు. అయితే, త్వరలో సల్మాన్ సోదరి అర్పిత వివాహం జరగనున్న నేపథ్యంలో, "మీకు ఆహ్వానం అందిందా?" అని అమీర్ ను మీడియా అడిగింది. అందుకా మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్, అర్పిత పెళ్లికి వెళ్లడానికి తనకు ఇన్విటేషన్ అవసరం లేదని చెప్పాడు. తమ మధ్య అలాంటి ఫార్మాలిటీస్ లేవన్నాడు. సల్మాన్ సోదరి తనకూ చెల్లిలాంటిదేనని, పిలవకపోయినా పెళ్లికి వెళతానని అన్నాడు.

  • Loading...

More Telugu News