: పేదవాళ్లకు పెద్దకొడుకుగా ఉంటా: చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ జిల్లా అరిపాకలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాల గురించి ప్రజలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదవాళ్లకు పెద్దకొడుకుగా ఉంటానని అన్నారు. పొదుపు గురించి ప్రజలకు వివరించారు. నెలకు రూ.500 పొదుపు చేస్తే కష్టకాలంలో అక్కరకు వస్తుందని ఓ వికలాంగుడికి సలహా ఇచ్చారు. జన్ ధన్ యోజన పథకంలో ఎంత మందికి బ్యాంకు అకౌంట్లు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేశారు. అకౌంట్లు ఉన్నవారిని చేతులు పైకెత్తమన్నారు. అనంతరం మాట్లాడుతూ, సంపాదించిన డబ్బులు ఇంట్లో ఉంచుకుంటే ఉపయోగం ఉండదని, బ్యాంకులో దాచుకోవడం ద్వారా వడ్డీ పొందవచ్చని వివరించారు. తద్వారా ఇబ్బందులు తొలగిపోతాయని తెలిపారు.