: ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్న డ్రీమ్ గర్ల్


డ్రీమ్ గర్ల్ గా అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన పాతతరం బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని తాను ప్రాతినిథ్యం వహిస్తున్న మధుర నియోజకవర్గంలోని రావల్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకం కింద ఈ గ్రామాన్ని దత్తత చేసుకున్నారు. రావల్ ను చక్కని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తానని హేమ తెలిపారు. ఈ నెల 17న గ్రామంలో అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని చెప్పారు. మధురకు రావల్ గ్రామం 9 కిలోమీటర్ల దూరంలో ఉంది.

  • Loading...

More Telugu News