: హాలీవుడ్ తారలా హెయిర్ స్టయిలింగ్ చేయలేదని సెలూన్ సిబ్బందిని కోర్టుకీడ్చింది!


తనకు హాలీవుడ్ తారలా హెయిర్ స్టయిలింగ్ చేయలేదంటూ ఓ యువతి సెలూన్ సిబ్బందిపై కన్స్యూమర్ కోర్టుకెక్కింది. వివరాల్లోకెళితే... మధ్యప్రదేశ్ లోని భోపాల్ నగరంలో మెహక్ అగర్వాల్ (19) అనే యువతి హెయిర్ స్టయిల్ ను మార్చుకోవాలని భావించింది. సిటీలో పేరుమోసిన ఓ బ్యూటీ సెలూన్ కు వెళ్లి హలీవుడ్ తార ఇవా మెండిస్ లా తనకు హెయిర్ స్టయిలింగ్ చేయాలని కోరింది. అయితే, తన శిరోజాల పొడవు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతూనే ఉంది అక్కడి హెయిర్ డ్రెస్సర్లకు. తేడా ఉండదంటూనే వారు ఆమె జుట్టును ఎడాపెడా కత్తిరించేశారు. ఇవా మెండిస్ లుక్కు రాలేదు సరికదా, భయంకరంగా తయారైంది. అద్దంలో చూసుకున్న మెహక్ ఆగ్రహంతో మండిపడింది. నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ సెలూన్ సిబ్బందిని కన్స్యూమర్ కోర్టుకీడ్చింది.

  • Loading...

More Telugu News