: 'లాంగెస్ట్ డ్రైవ్'తో గిన్నిస్ బుక్ లోకి 'హోండా అమేజ్' కారు
హోండా అమేజ్ కారు లాంగెస్ట్ డ్రైవ్ తో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది. సెప్టెంబర్ 15న ఈ డ్రైవ్ ప్రారంభం కాగా, అమేజ్ కారు మొత్తం 23,800 కిలోమీటర్లు ప్రయాణించింది. 55 రోజుల పాటు సాగిన ఈ ప్రయాణం 400 పట్టణాల గుండా సాగింది. ఒకే దేశంలో ఓ కారు ప్రయాణించిన అత్యధిక దూరం ఇదే. ఈ ఘనతే అమేజ్ కారును గిన్నిస్ ఎక్కించింది. భారత్ లోని కొండ ప్రాంతాలు, పలు రకాల నేలలు, తీర ప్రాంతాలు, జాతీయ రహదారులు, నగరాల్లోని ఇరుకైన రోడ్ల గుండా అమేజ్ కారు ప్రయాణించింది. దీనిపై హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ప్రెసిడెంట్ మరియు సీఈఓ హిరోనారి కనయామా మాట్లాడుతూ, హోండా అమేజ్ కారు గిన్నిస్ బుక్ లోకి ఎక్కిందని ప్రకటించడానికి సంతోషిస్తున్నామని తెలిపారు.