: శాస్త్ర, సాంకేతిక సహాయమంత్రిగా సుజనా చౌదరి బాధ్యతల స్వీకరణ
కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రిగా ఢిల్లీలో సుజనా చౌదరి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరిశోధన రంగం చాలా వెనుకబడి ఉందన్నారు. పరిశోధన రంగం అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రిగా చాలా ఆనందంగా ఉందని... దేశానికి, రాష్ట్రానికి సేవ చేయడానికి ఇదో మంచి అవకాశమని సుజనా పేర్కొన్నారు.