: అధికారంలోకి వచ్చాక, మాపై ఆరోపణలు చేయడం తగదు: జానారెడ్డి
టీఆర్ఎస్ ప్రభుత్వానికి శాసనసభలో మాజీ మంత్రి జానారెడ్డి చురకలంటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీపై బురదజల్లే కార్యక్రమం పెట్టుకోవడం తగదని అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించే విషయంలో ఈర్ష్య, అసూయలు ఉండరాదని హితవు పలికారు. ప్రజా సమస్యలను లేవనెత్తడం తమ బాధ్యత అని... తామిచ్చే సూచనలను స్వీకరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. అధికార పక్షం, విపక్షం అనే తేడా లేకుండా అందరం కలిసి రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడాలని అన్నారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పులను ప్రస్తుత ప్రభుత్వం సరిదిద్దాల్సిన అవసరం ఉందని చెప్పారు.