: రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన మనోహర్ పారికర్
కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ రాజ్యసభ ఎన్నికకు నామినేషన్ దాఖలు చేశారు. కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే నిన్న(ఆదివారం) లక్నో వెళ్లిన ఆయన ఈరోజు ఒంటిగంటకు అక్కడి విధానసభలో నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా పారికర్ వెంట కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ ఉన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, యూపీ నుంచి రాజ్యసభ ఎన్నికకు ప్రాతినిధ్యం వహించడం అదృష్టమన్నారు. కొన్ని రోజుల్లో ఉత్తరప్రదేశ్ నుంచి పలువురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం పూర్తవనుంది. ఈ క్రమంలో ఆయనను పార్టీ తరపున అక్కడి నుంచి బీజేపీ ఎన్నుకోనుంది. ఈ నెల 20న ఇక్కడ రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి.