: గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు తప్పనిసరి: ప్రభుత్వం సన్నాహాలు
ఇకపై గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఓటరు తన ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాల్సిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటును తప్పనిసరి చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం బిల్లును రూపొందిస్తోంది. నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉండగానే ఈ ప్రతిపాదనకు అంకురార్పణ జరిగింది. మోదీ ప్రధానిగా పదవి చేపట్టిన తర్వాత ఆయన స్థానంలో పాలన పగ్గాలు చేపట్టిన ఆనంది బెన్ ఈ బిల్లుకు మరింత పదును పెట్టేందుకు శ్రీకారం చుట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆనంది బెన్ సర్కారు తలపోస్తోంది. అయితే ఈ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.