: బీజేపీతో జతకట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు: సీపీఐ నారాయణ


వైకాపా అధినేత జగన్ పై సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ చేపట్టిన ఢిల్లీ యాత్ర వెనుక అసలైన కారణం మరొకటుందని... బీజేపీ చెంతన చేరేందుకు జగన్ యత్నిస్తున్నారని వెల్లడించారు. అయితే, జగన్ యత్నాలను అడ్డుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. వీరిద్దరూ ప్రజా సమస్యలను పక్కనబెట్టి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని... ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఢిల్లీలో పరిభ్రమిస్తున్నాయని అన్నారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని... ఇది అనైతికమని తెలిపారు.

  • Loading...

More Telugu News