: సురేశ్ ప్రభుకు రైల్వే... న్యాయ శాఖకు సదానంద!
కేంద్ర కేబినెట్ పునర్వ్యస్థీకరణలో భాగంగా స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానందగౌడకు షాక్ తగిలింది. మొన్ననే రేల్వే ప్రత్యేక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సదానందకు ఇకపై ఆ అవకాశం రాకపోవచ్చు. ఎందుకంటే, ఆయన రైల్వే శాఖ నుంచి న్యాయ శాఖకు మారనున్నారు. శివసేనకు సలాం చెప్పి, బీజేపీలో చేరిన సురేశ్ ప్రభు ఇకపై రైల్వే మంత్రిగా కొనసాగుతారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ మార్పులు చేశారు. మొన్నటి సినీ తారతో కొడుకు ప్రేమాయణం సదానందకు భారీగానే నష్టం చేసినట్లుంది. అయితే, ఆయన సచ్ఛీలత ఆయనను కేంద్ర కేబినెట్ నుంచి బయటకు పంపించలేకపోయింది.