: రేపటి నుంచి మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు


మహారాష్ట్రలో అధికార పగ్గాలు చేపట్టిన దేవేంద్ర ఫడ్నవీస్ సర్కారు విశ్వాస పరీక్ష నిమిత్తం రేపటి నుంచి ఆ రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో భాగంగా తొలి రెండు రోజులు కొత్తగా ఎన్నికైన సభ్యుల చేత ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం ఈ నెల 12న ఫడ్నవీస్ సర్కారు విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఫడ్నవీస్ సర్కారు ఎన్సీపీ మద్దతు తీసుకోవడం మినహా గత్యంతరం లేదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. రానున్న రెండు రోజుల్లో బీజేపీ, శివసేనల మధ్య సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగితే ఎన్సీపీ మద్దతు అవసరం లేకుండానే ఫడ్నవీస్ బల పరీక్షలో నెగ్గనున్నారు.

  • Loading...

More Telugu News