: ఈ నెల 11 నుంచి చంద్రబాబు విదేశీ పర్యటన


ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఈ నెల 11 నుంచి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా జరుపుతున్న ఈ పర్యటనలో చంద్రబాబు, తన వెంట అధికారులతో పాటు పారిశ్రామికవేత్తలను కూడా తీసుకెళుతున్నారు. తొలుత మూడు రోజుల పాటు సింగపూర్ లో పర్యటించనున్న చంద్రబాబు అక్కడి ప్రభుత్వ పెద్దలతో పాటు పారిశ్రామిక దిగ్గజాలతోనూ భేటీలు నిర్వహిస్తారు. సింగపూర్ పర్యటన తర్వాత ఈ నెల 24 నుంచి 29 దాకా చంద్రబాబు జపాన్ లో పర్యటిస్తారు.

  • Loading...

More Telugu News