: విశాఖలో నేవీ చీఫ్...నౌక ప్రమాద మృతుడి కుటుంబానికి పరామర్శ


భారత నౌకాదళ చీఫ్ ఆర్ కే ధావన్ ఆదివారం విశాఖపట్నం వచ్చారు. ఇటీవల సముద్రంలో నౌకాదళ ఓడ మునిగిపోయిన ఘటనలో చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ప్రమాదంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. నివేదిక అందగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ధావన్ వెల్లడించారు. ఈ నెల 6న విశాఖ తీరంలో భారత నౌకాదళానికి చెందిన ఓడ సముద్రంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడు.

  • Loading...

More Telugu News