: హాకీ సిరీస్ లో ఆసిస్ పై భారత్ చారిత్రక విజయం
హాకీలోనూ భారత్ తన సత్తా చాటింది. క్రికెట్ లో నిన్నటిదాకా రారాజుగా వెలిగిన ఆస్ట్రేలియాను టీమిండియా చిత్తు చేసిన మాదిరిగానే, భారత హాకీ జట్టు కూడా ఆస్ట్రేలియా హకీ జట్టుపై ఆదివారం చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ఆస్ట్రేలియా నగరం పెర్త్ లో నాలుగు మ్యాచ్ ల సిరీస్ ఇరుదేశాల జట్ట మధ్య జరిగింది. ఆదివారం చివరి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్, ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. దీంతో భారత జట్టు సిరీస్ ను భారత జట్టు 3-1 తేడాతో కైవసం చేసుకుంది.