: ఆరెస్సెస్ నా ప్రభుత్వాన్ని ప్రభావితం చేయలేదు: మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్


రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)... బీజేపీ సైద్ధాంతిక గురువు. నేటి భారత ప్రధాని నుంచి దేశంలోని పలు రాష్ట్రాల బీజేపీ సీఎంలు ఆరెస్సెస్ నేపథ్యమున్నవారే. గతంలోనూ బీజేపీపై తన ఆధిపత్యాన్ని చెలాయిస్తూ వస్తున్న ఆరెస్సెస్, మోదీ ప్రధాని అయిన తర్వాత ప్రభుత్వ పాలనలో మరింత ప్రభావం చూపనుందన్న వాదన వినిపించింది. ఆ దిశగానే అటు హర్యానాతో పాటు ఇటు మహారాష్ట్ర ప్రభుత్వాల పగ్గాలు మాజీ ఆరెస్సెస్ నేతలనే వరించాయి. అయితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అందుకు విరుద్ధమైన ప్రకటన చేశారు. తన ప్రభుత్వంపై ఆరెస్సెస్ ప్రభావం ఎంతమాత్రం ఉండబోదని తేల్చిచెప్పారు. మరి అంతటి సాహసం చేసే అవకాశం అటు ఆరెస్సెస్ తో పాటు ఇటు మోదీ ఆయనకు కల్పిస్తారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

  • Loading...

More Telugu News