: మూడో వన్డేలో జయవర్ధనే సెంచరీ
భారత్ తో జరుగుతున్న మూడో వన్డేలో లంక స్టార్ ప్లేయర్ మహేళ జయవర్ధనే సెంచరీ సాధించాడు. మొత్తం 109 బంతులను ఎదుర్కున్న జయవర్ధనే 10 ఫోర్లు, ఓ సిక్స్ తో చెలరేగి శతకం నమోదు చేశాడు. జయవర్ధనే మెరుపులతో లంక 40 ఓవర్లలో 185 పరుగులు చేసింది. ఓపెనర్ దిల్షాన్ కొంతసేపు జయవర్దనేకు మద్దతుగా నిలిచాడు. అతడి నిష్క్రమణ తర్వాత లంక బ్యాట్స్ మన్ వచ్చినట్టే వచ్చి వెనుదిరిగారు. అయినా జయవర్ధనే ఒంటరి పోరు సాగిస్తున్నాడు. దీంతో లంక భారీ స్కోరు దిశగా దూసుకెళుతోంది.