: దత్తన్నకు మంత్రి పదవిపై కేసీఆర్ హర్షం


అదేంటీ, బీజేపీ నేతకు బీజేపీ ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కితే, ఆ పార్టీతో ప్రత్యక్ష పోరుకు దిగిన కేసీఆర్ హర్షం వ్యక్తం చేస్తారా? అంటే, హర్షం వ్యక్తం చేయడమేంటీ, కేసీఆర్ ఏకంగా ఎగిరి గంతేసినంత పనిచేశారు. ఆదివారం నాటి కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా సికింద్రాబాద్ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయకు స్వతంత్ర హోదాలో సహాయ మంత్రి పదవి దక్కింది. సరిగ్గా ఆ సమయంలో బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుకు తెలంగాణ సర్కారు పౌర సన్మానం చేసింది. ఈ కార్యక్రమానికి స్వయంగా హాజరైన కేసీఆర్, దత్తన్నకు మంత్రి పదవి దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణకు చెందిన దత్తాత్రేయ కేంద్ర మంత్రిగా పదవి చేపట్టడంతో రాష్ట్ర సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకునేందుకు అవకాశం చిక్కిందన్న భావనతో కేసీఆర్ ఈ మేరకు స్పందించారు.

  • Loading...

More Telugu News