: లోపల బ్యాటింగ్...బయట ఫైటింగ్: ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత


నిజమే, ఆదివారం హైదరాబాద్ లోని ఉప్పల్ స్డేడియం వద్ద ఇలాంటి పరిస్థితే నెలకొంది. స్టేడియం లోపల భారత్, శ్రీలంకల మధ్య మూడో వన్డేలో భాగంగా శ్రీలంక జట్టు బ్యాటింగ్ చేస్తుంటే, బయట మాత్రం క్రికెట్ అభిమానులు, పోలీసుల మధ్య తీవ్ర స్థాయిలో ఫైటింగ్ జరిగింది. లోపల లంకేయుల బ్యాటింగ్ మందకొడిగా సాగినా, బయటి ఫైటింగ్ మాత్రం క్షణాల్లో అక్కడి క్రీడా సంబరాన్ని ఉద్రిక్తంగా మార్చివేసింది. బ్లాక్ టికెట్ల ఆరోపణల నేపథ్యంలో పోలీసులు క్రీడాభిమానులపై దాడికి దిగారు. దీంతో సహనం కోల్పోయిన యువకులు పోలీసులపైకి తిరగబడ్డారు. స్టేడియం వద్ద బ్లాక్ టికెట్లు అమ్ముతున్నారని మఫ్టీలోని పోలీసులు కొందరు యువకులపై దాడి చేశారు. అయితే వారు పోలీసులని తెలియక బాధిత యువకులు వారిని చితకబాదారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు యువకులపై లాఠీచార్జీ చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి.

  • Loading...

More Telugu News