: తెలంగాణ నుంచి తొలి కేంద్ర మంత్రి...దత్తన్నకు అరుదైన ఘనత
దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తొలినేతగా బండారు దత్తాత్రేయ అరుదైన ఘనతను సాధించారు. సికింద్రాబాద్ నుంచి నాలుగో సారి ఎంపీగా గెలిచిన దత్తాత్రేయ, మంత్రి పదవి చేపట్టడం కూడా ఇది నాలుగో సారే కావడం గమనార్హం. గతంలో వాజ్ పేయ్ హయాంలో కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించిన దత్తాత్రేయ, తాజాగా మోదీ కేబినెట్ లోనూ కీలక శాఖ బాధ్యతలు చేపట్టనున్నారు.