: మోదీ కేబినెట్...ఒన్ మేన్ ఆర్మీ: డిగ్గీ రాాజా
ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆదివారం మరోమారు విరుచుకుపడ్డారు. అయితే ఈ దఫా ఎలా దాడి చేయాలో తెలియక మోడీని దాదాపుగా పొగిడినంత పనిచేశారు. మోదీకి కేబినెట్ అవసరం లేదని, మోదీ ఒక్కరే ఒన్ మేర్ ఆర్మీ అంటూ వ్యాఖ్యానించారు. అయినా, ఒన్ మేన్ ఆర్మీగా కొనసాగుతున్న మోదీ కేబినెట్ విస్తరణపై ఎందుకంత ఆసక్తి? అంటూ డిగ్గీ రాజా విలేకరులనే ఎదురు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో సీనియర్ నేత పీసీ చాకో మోదీ సర్కారుకు శుభాకాంక్షలు చెప్పేసి, ఆరోపణలు చేసేందుకేమీ లేదంటూ ముగించేయడం గమనార్హం.