: రాణించిన ఉమేశ్ యాదవ్... రెండు ఓవర్లలోనే రెండు లంక వికెట్లు డౌన్


భాతర ఫేస్ బౌలర్ ఉమేశ్ యాదవ్ మూడో వన్డేలో జూలు విదిల్చాడు. వేసిన తొలి ఓవర్, చివరి బంతికే కుశాల్ పెరీరాను పెవిలియన్ పంపిన ఉమేశ్, వరుసగా రెండో ఓవర్ తొలి బంతికే లంక స్టార్ ప్లేయర్ కుమార్ సంగక్కర వికెట్ పడగొట్టాడు. దీంతో 13 బంతులకే రెండు కీలక వికెట్లు కోల్పోయిన లంక పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ప్రస్తుతం జయవర్దనే, తిలకరత్నే దిల్షాన్ లు క్రీజులో కుదురుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఏడు ఓవర్లలో లంకేయులు 31 పరుగులు రాబట్టారు.

  • Loading...

More Telugu News