: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక
తొలి వన్డే మాదిరే మూడో వన్డేలోనూ లంకేయులు టాస్ గెలిచారు. బ్యాటింగ్ ఎంచుకున్నారు. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న మూడో వన్డేలో భాగంగా శ్రీలంక టాస్ గెలిచింది. టీమిండియాకు బౌలింగ్ అప్పగించింది. తొలి వన్డేలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక జట్టు భారత్ చేతిలో చిత్తుగా ఓడింది. రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసినా, ఆ జట్టు ఆశలపై తెలుగు తేజం అంబటి రాయుడు నీళ్లు చల్లాడు. మరి తిరిగి తొలుత బ్యాటింగ్ కు దిగేందుకు నిర్ణయించుకున్న లంకేయులు నేటి మ్యాచ్ లో ఎలాంటి ఫలితం సాధిస్తారో చూడాలి. అయితే, స్టేడియం ప్రాంతంలో వర్షం కురుస్తున్న నేపథ్యంలో మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది.