: అసోంలో తెలుగు కాంట్రాక్టర్ కిడ్నాప్
మొన్నటికి మొన్న ఈశాన్య రాష్ట్రాల్లో ఇద్దరు తెలుగు ఇంజినీర్లు కిడ్నాప్ నకు గురికాగా, తాజాగా, అసోంలో బోడో తీవ్రవాదులు తెలుగు కాంట్రాక్టర్ ను అపహరించారు. ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా రాయచోటికి చెందిన మహేశ్వర్ రెడ్డిని బోడో తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో కూరుకుపోయారు. మహేశ్వర్ రెడ్డిని బోడో తీవ్రవాదుల నుంచి విడిపించేందుకు రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి రంగంలోకి దిగారు.