: అగ్ని-2 ప్రయోగం విజయవంతం
అణ్వస్త్రాలను మోసుకెళ్లగలిగే సామర్థ్యమున్న అగ్ని-2 మధ్య శ్రేణి క్షిపణిని ఒడిశాలోని వీలర్ ఐలాండ్ నుంచి విజయవంతంగా ప్రయోగించారు. ఆర్మీ సన్నాహకాల్లో భాగంగా ఈ ప్రయోగం చేపట్టారు. 1000 కిలోల పేలోడ్ మోసుకెళ్లే ఈ 'సర్ఫేస్ టు సర్ఫేస్' మిస్సైల్ 2000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఈ ఉదయం ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ లో మొబైల్ లాంచర్ నుంచి ఈ మిస్సైల్ ని ప్రయోగించారు. ఈ అణ్వస్త్ర క్షిపణిని భారత సైన్యంలో ఎప్పుడో ప్రవేశపెట్టినా, కొత్తగా ఏర్పాటైన స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ అవసరాలకు సరిపోతుందా?లేదా? అన్న కోణంలో ఈ పరీక్ష నిర్వహించారు. అత్యాధునికమైన రాడార్లు, ఎలక్ట్రో ఆప్టిక్ సాధన సంపత్తి టెలిమెట్రీ స్టేషన్లు అగ్ని-2 గమనాన్ని పరిశీలించాయి.