: నల్గొండ జిల్లాలో విచక్షణ కోల్పోయిన టీచర్... చిన్నారి మృతి
నల్గొండ జిల్లా హాలియా మండలం తిరుమలగిరిలో విషాదం చోటుచేసుకుంది. గ్రేట్ వే స్కూల్లో ఐదేళ్ల బాలుడిని టీచర్ గోడకేసి కొట్టడంతో, ఆ చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. దీంతో, బాలుడి మృతదేహంతో బంధువులు స్కూలు ఎదుట ఆందోళనకు దిగారు. స్కూలుపై దాడిచేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు.