: జూపల్లి.. జూలో పిల్లిలాంటి వాడు: డీకే అరుణ


రాష్ట్ర మంత్రి డీకే అరుణ తన జిల్లాకే చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావుపై విరుచుకుపడ్డారు. జూపల్లి.. జూలో పిల్లిలాంటి వాడని ఆమె వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో ఉండి రాజకీయాలు చేయడం కాదని, దమ్ముంటే నియోజకవర్గానికి రావాలని జూపల్లికి అరుణ సవాల్ విసిరారు. జూపల్లి గతంలో కాంగ్రెస్ పార్టీ తరుపున కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి రెండుమార్లు గెలిచి మంత్రి పదవులు చేపట్టారు. అనంతరం ఆయన పార్టీని వీడీ టీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి డీకే అరుణకు, జూపల్లికి మధ్య విభేదాలు నడుస్తూనే ఉన్నాయి.

  • Loading...

More Telugu News